మేషం: ఎటువంటి స్వార్థచింతన లేకుండా ఇతరులకు సహాయం చేస్తారు. తొందరపడి వాగ్దానాలు చేసి సమస్యలు తెచ్చుకోకండి. హోటల్, తినుబండారాల వ్యాపారులకు పనివారితో సమస్యలు తలెత్తుతాయి. మిత్రుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. స్త్రీలకు సంతానంతో, వర్కర్లతో చికాకులు తప్పవు. వృషభం: ప్రభుత్వ సంస్థలలో పనులు పూర్తి అవుతాయి. రుణంలో కొంత మొత్తం తీర్చటంతో ఒత్తిడి నుండి కుదుటపడతారు. రసాయనిక సుగంధ ద్రవ్య వ్యాపారులకు లాభాదయకంగా ఉంటుంది. విద్యార్థులు కళాత్మక, క్రీడాపోటీలలో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు రాతపరీక్షలు, ఇంటర్వ్యూలు సత్ఫలితాలనిస్తాయి.…