మేషం: దైవ సేవా కార్యక్రమాలలో ఇబ్బందులు తప్పవు. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళుకువ అసవరం. ఇతరులకు పెద్ద మొత్తంలో ధనసహాయం చేసే విషయంలో లౌక్యంగా మెలగాలి. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. రావలసిన ధనం సకాలంలో అందుతుంది. మిత్రులను కలుసుకుంటారు. వృషభం: బంధువుల రాకతో గృహంలో సందడి కానొస్తుంది. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ప్రముఖులను కలుసుకుంటారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. విద్యార్థుల మొండివైఖరి ఉపాధ్యాయులకు…