జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న “ఆర్ఆర్ఆర్” సినిమాలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆయన రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్నారు. అయితే ఈ మధ్యనే కరోనా నుంచి కోలుకుని తన అభిమానులకు శుభవార్త చెప్పిన ఎన్టీఆర్ ఇంట్లో తాజాగా ఒక శుభకార్యం జరిగినట్లు సమాచారం. ఎన్టీఆర్ కు ఇద్దరు కుమారులు అన్న సంగతి అందరికీ తెలిసిందే. మొదటి కుమారుడి పేరు అభయ్ రామ్. రెండో కుమారుడు భార్గవ్ రామ్. ఆయన 2018…
దివంగత ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. అనాథ శవాలకు అంతిమ సంస్కారాలను నిర్వహించే బాధ్యతను చేపట్టింది. ఇప్పటికే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా టెలీమెడిసిన్, మందుల పంపిణీ, అన్నదానం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో నాలుగు ఆక్సిజన్ ప్లాంట్లును ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఏపీలోని టెక్కలి, కుప్పం, పాలకొల్లు, రేపల్లె పట్టణాల్లో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు ట్రస్ట్ తెలిపింది. ఎన్టీఆర్ ట్రస్ట్ లో ఏర్పాటుచేసిన కాల్…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు భారీ అభిమానగణం ఉన్న విషయం తెలిసిందే. టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన ఎన్టీఆర్ సినిమా విడుదల అవుతుందంటే నందమూరి అభిమానుల హడావుడి మాములుగా ఉండదు. అయితే సోషల్ మీడియాలోనూ విశేషంగా ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్నారు ఎన్టీఆర్. తాజాగా ఆయన సోషల్ మీడియాలో మరో మైలు స్టోన్ ను అందుకున్నారు. నిన్న నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా… ఒకేరోజు తారక్ ను దాదాపు 2 వేల మంది ఫాలో…
ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులతో పాటు భారతదేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ఏదైనా ఉందంటే అది రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకి సంబంధించి రోజుకో ఒక ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే తాజాగా సమాచారం ప్రకారం సినిమాలో ఎన్టీఆర్, చరణ్ ఇద్దరి కాంబినేషన్ లో ఒక ప్రత్యేక పాట…
తెలుగువారి మదిలో చెరిగిపోని, తరిగిపోని స్థానం సంపాదించిన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు 99వ జయంతి నేడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లి తండ్రికి నివాళులు అర్పించారు నందమూరి బాలకృష్ణ. అంతేకాదు తండ్రికి ఘన నివాళిగా బాలయ్య స్వయంగా పాడిన ‘శ్రీరామదండకం’ వీడియోను తాజాగా విడుదల చేశారు. యన్టీఆర్ పోషించిన శ్రీరాముని పాత్రల బొమ్మలపై బాలయ్య గానం చేసిన’శ్రీరామదండకం’ గద్యం పాడారు. “సంపూర్ణ రామాయణం, లవకుశ, శ్రీకృష్ణసత్య, శ్రీరామాంజనేయ యుద్ధం, శ్రీరామపట్టాభిషేకం” చిత్రాలలోనూ “చరణదాసి,…
“మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది… మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది… పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెను మరొక్కసారి తాకి పో తాతా… సదా మీ ప్రేమకు బానిసను… నందమూరి తారకరామారావు” అంటూ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా తారక్ ఎమోషనల్ పోస్ట్ చేశారు. నేడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, నటరత్న నందమూరి తారకరామారావు 99వ జయంతి. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని, ఖ్యాతిని కాపాడిన తెలుగు ముద్దుబిడ్డ ఎన్టీఆర్. నటసార్వభౌముడిగా పేరు…
విశాఖ బీచ్ రోడ్డులో ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి, టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడుపల్లా శ్రీనివాస్, tnsf రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. సీని రంగం ద్వారా ఎన్టీఆర్ తెలుగు జాతికి మంచి పేరు తెచ్చారని..రాజకీయాలలోకి వచ్చిన తర్వాత ప్రజల్లో చైతన్యం తెచ్చారని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాలకు అవకాశం ఇచ్చిన మహానుభావుడు ఎన్టీఆర్ అని…
ఎదురులేని ప్రజానాయకుడు, తిరుగులేని కథానాయకుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, నటరత్న నందమూరి తారకరామారావు జయంతి నేడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు ప్రముఖులు. మెగాస్టార్ చిరంజీవి నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇవ్వాలని కోరారు. “ప్రముఖ గాయకులు, నవయుగ వైతాళికులు భూపేన్ హజారికా గారికి మరణానంతరం భారత రత్న ఇచ్చినట్టు, మన తెలుగుతేజం, దేశం గర్వించే నాయకుడు నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇస్తే అది తెలుగు వారందరికీ…
కోట్లాది తెలుగు వారి ఆరాధ్య దైవం , యావత్ ప్రపంచంలోనే మన తెలుగు వారికి ఒక గుర్తింపు తెచ్చిన ఒక ఐకాన్ సీనియర్ ఎన్టీఆర్. యావత్ దేశానికే రాజకీయ దిశా నిర్దేశం చేశారు ఎన్టీఆర్. నేడు ఎన్టీఆర్ 98వ జయంతి. అయితే ఎన్టీఆర్ జయంతి సందర్భంగా పలువురు నివాళులు అర్పించారు. ఇందులో భాగంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు హీరో నందమూరి బాలకృష్ణ. ఈ సందర్బంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ఎప్పుడూ మనతోనే ఉంటారని..తెలుగు ప్రజలకు…