యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో “ఎన్టీఆర్ 31” తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ 31 ను మైత్రి మూవీ మేకర్స్, నందమూరి కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అయితే ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ నటించబోతోంది అంటూ తాజాగా వార్తలు బయలుదేరాయి. ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ ను నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ వారు బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను ఈ సినిమాలో హీరోయిన్ గా నటింపజేయాలని ప్రయత్నాలు మొదలు పెట్టారట. ఈ మేరకు ఆమె తండ్రి బోనీ కపూర్ ను సంప్రదించినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా దివంగత నటి శ్రీదేవి కుమార్తె, బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్ టాలీవుడ్ ఎంట్రీ గురించి చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2018 లో “ధడక్”తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ యువ నటి “గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్” చిత్రంలో తన అద్భుతమైన నటనా నైపుణ్యానికి ప్రశంసలు అందుకుంది. అయితే చాలా కాలంగా చాలా మంది తెలుగు చిత్రనిర్మాతలు జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ గురించి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తెలియని కారణాల వల్ల ఈ బ్యూటీ మాత్రం ఇప్పటివరకూ టాలీవుడ్ సినిమాల్లో నటించడానికి మక్కువ కనబరచలేదు.