NTR Ghat: టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ఎన్టీఆర్ తనయుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, మనవడు జూనియర్ ఎన్టీఆర్ నివాళులర్పించారు.
నందమూరి బాలకృష్ణ గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మాట కటువే కానీ మనసు మాత్రం వెన్న అని అందరికి తెలిసిందే. ఇక బయట వేడుకలకు వచ్చినప్పుడు అభిమానులపై బాలయ్య చేయి చేసుకోవడం సాధారణంగా జరిగే ఘటనలే. ఇంకొన్ని చోట్ల రిపోర్టర్లపై కూడా అబలయ్య చిందులు తొక్కినా సందర్భాలు కోకోల్లలు. ఇక తాజాగా మరోసారి రిపోర్టర్ కి స్ట్రాంగ్ పంచ్ ఇచ్చారు బాలయ్య. నేడు బాలకృష్ణ తండ్రి, దివంగత నటుడు ఎన్టీఆర్…