తెలుగు చిత్రసీమలో అతిరథ మహారథులు అనదగ్గ నటీనటులు నటించిన అపురూప చిత్రాలు ఈ నాటికీ ప్రేక్షకులను పరవశింపచేస్తూనే ఉన్నాయి. అలాంటి పౌరాణిక చిత్రం ‘భూకైలాస్’. ఈ సినిమా ప్రతి మహాశివరాత్రి నాడు ఏదో ఒక చోట ప్రదర్శితమవుతూ ఉంటుంది. కనీసం బుల్లితెరపై అయినా ‘భూకైలాస్’ దర్శనమివ్వక మానదు. కర్ణాటకలో సుప్రసిద్ధ శైవక్షేత్రం గోకర్ణం వెలసిన విధంబు ఎట్టిదో తెలుపుతూ ఈ చిత్రం రూపొందింది. ఇందులో భక్తునిగా రావణుడి దీక్ష, పట్టుదల మనకు కళ్ళకు కట్టినట్టు చూపించారు. రావణబ్రహ్మగా…