Hindupuram: ప్రముఖ సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రజా సేవల్లో ముందుంటారు. ఇప్పటికే హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ద్వారా ఎంతో మంది రోగులకు ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నారు. తాజాగా తన నియోజకవర్గం హిందూపురం ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు సిద్ధమయ్యారు. దీని కోసం ఎన్టీఆర్ ఆరోగ్య రథంను సిద్ధం చేశారు. ఈ వాహనం ద్వారా 200కి పైగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు, వైద్యుల సంప్రదింపులు, మాతా శిశు సంరక్షణ, ఆరోగ్య అవగాహన…