నందమూరి బాలకృష్ణ, జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) వేదికపై గౌరవప్రదమైన గంటను మోగించి, దక్షిణ భారతదేశంలోనే తొలి నటుడిగా చరిత్రలో నిలిచారు. ఈ అరుదైన గౌరవం ఆయన కెరీర్‌లో ఒక కీలక అధ్యాయంగా మిగిలిపోనుంది. ఎన్‌ఎస్‌ఈ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో బాలకృష్ణతో పాటు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. తన తల్లి స్మృతికి గౌరవంగా బాలకృష్ణ స్థాపించిన ఈ స్వచ్ఛంద సంస్థ, ఆర్థికంగా…