Andhra Pradesh: చరిత్రలో తీపి జ్ఞాపకాలతో పాటు చేదు గుళికలు కూడా ఉంటాయి. అలాంటిదే ఆంధ్రప్రదేశ్‌లోని దివిసీమ ఉప్పెన విషాదం. యావత్ భారత్ దేశాన్ని కదిలించిన దివి సీమ ఉప్పెన విషాదానికి నేటితో 45 ఏళ్లు పూర్తవుతున్నాయి. 1977 నవంబర్ 19న కృష్ణా జిల్లా సమీపంలోని సముద్రంలో తుపానుతో వేల మంది ప్రాణాలు కడలిలో కలిసిపోయాయి. ఈ ప్రకృతి విలయానికి అధికారికంగానే 14వేలకు పైగా ప్రజలు మరణించారు. అనధికారికంగా సుమారు 50 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.…
ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. శతాబ్దంలోనే సుదీర్ఘమైన పాక్షిక చంద్రగహణం నవంబరు 19న కార్తిక పౌర్ణమి రోజు వినువీధిలో దర్శనమివ్వబోతుంది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్ధ నాసా ఈ విషయాన్ని ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా నవంబరు 18, 19 తేదీల్లో వివిధ సమయాల్లో ఈ గ్రహణం కనిపించనుండగా.. భారతకాలమానం ప్రకారం నవంబరు 19న శనివారం మధ్యాహ్నం ఒకటిన్నరకు.. చంద్రుడు, సూర్యుడికి మధ్య భూమి ఒకే వరుసలో వచ్చి .. భూమి నీడ అసంపూర్తిగా చంద్రుడిపై పడి…