November 19: నవంబర్ 19, 2023… భారత క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ చెరగని ఒక చేదు జ్ఞాపకం. ఆ రాత్రి టీమిండియా కేవలం ఒక ఫైనల్ మ్యాచ్‌ను మాత్రమే కోల్పోవడమేకాక.. కోట్లాది భారతీయుల కలలు, ఆశలు, అభిలాషలు ఛిన్నాభిన్నమయ్యాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ప్రేక్షకులతో నిండిపోయి ఉన్న మ్యాచ్ ముగిసే సరికి అక్కడ నెలకొన్న నిశ్శబ్ధం గుండెల్ని పిండివేసింది. దీనికి కారణం ఆ రోజునే భారత్ 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో…