దర్శక ధీరుడు రాజమౌళి ‘బాహుబలి’ సినిమాలో శివగామి పాత్రధారి రమ్యకృష్ణ డైలాగ్ గుర్తుంది కదా! ‘నా మాటే శాసనం’ అంటూ ఉంటుంది. ఇప్పుడు అదే మాటను కాస్తంత మార్చి ‘నియంత మాటే శాసనం’ అంటున్నాడు బిగ్ బాస్. సీజన్ 5 ముగియడానికి ఇంకా మూడు వారాలు మాత్రమే ఉండటంతో, చివరి కెప్టెన్సీ టాస్క్ ను మొదలు పెట్టేశారు. దాని పేరే ‘నియంత మాటే శాసనం’. ఇందుకోసం గార్డెన్ ఏరియాలో ఓ భారీ సింహాసనం పెట్టారు. బజర్ మోగగానే…