Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలకంగా మారిన శ్రవణ్ రావును పోలీసులు నేడు మరోసారి విచారణకు పిలిపించారు. ఇప్పటికే మూడు సార్లు శ్రవణ్ రావును విచారించిన దర్యాప్తు బృందం, తాజా పరిణామాల నేపథ్యంలో నేడు కూడా విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది. శ్రవణ్ రావు సెల్ ఫోన్ లో తొలగించిన సమాచారాన్ని పోలీసులు రీట్రీవ్ చేస్తున్నట్లు సమాచారం. ఫోన్లో ఉండే డిలీట్ చేసిన డేటా ద్వారా మరిన్ని ఆధారాలు లభించే అవకాశం ఉందని…