ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో డయేరియా ఇంకా అదుపులోకి రాలేదు. ఆరు రోజులుగా డయేరియా కేసులు ప్రభుత్వాస్పత్రికి వస్తూనే ఉన్నాయి. జగ్గయ్యపేట, వత్సవాయి మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన కొందరు వాంతులు, విరేచనాలతో పట్టణంలోని ప్రభుత్వాస్పత్రిలో చేరారు. ప్రస్తుతం జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో 22 మందికి చికిత్స అందిస్తున్నారు. ఇద్దరు పేషేంట్లకు విజయవాడలో చికిత్స అందిస్తున్నారు. కొంత మందికి పరిస్థితి సాధారణమై డిశ్చార్జ్ అయ్యారు.