ఉత్తర ఇజ్రాయెల్‌పై లెబనాన్ 15 రాకెట్లు ప్రయోగించిందని ఐడీఎఫ్ వెల్లడించింది. కొన్ని రాకెట్లను అడ్డగించగా.. మరికొన్ని ఇజ్రాయెల్ భూభాగంలో పడ్డాయని తెలిపింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని స్పష్టం చేసింది. అలాగే ఆస్తి నష్టాలు కూడా పెద్దగా జరగలేదని పేర్కొంది. ఐడీఎఫ్ డ్రోన్ రాకెట్ లాంచర్‌లను కూల్చివేసేసింది
ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య యుద్ధం తీవ్రతరంగా మారుతోంది. శుక్రవారం.. లెబనాన్‌లోని హిజ్బుల్లా, ఉత్తర ఇజ్రాయెల్‌పై ఒకదాని తర్వాత ఒకటి మూడు దాడులు చేసింది. ఈ మూడు దాడుల్లో హిజ్బుల్లా ఉగ్రవాదులు దాదాపు 140 క్షిపణులను ప్రయోగించారు. ఈ దాడుల్లో జరిగిన నష్టం ఎంతనేది తెలియరాలేదు.