రష్యా-ఉక్రెయిన్ మధ్య గత నాలుగేళ్ల నుంచి యుద్ధం సాగుతోంది. ఇరు దేశాలు నువ్వానేనా? అన్నట్టుగా దాడులు చేసుకుంటున్నాయి. తాజాగా ఆపరేషన్ స్పైడర్ వెబ్ పేరుతో ఉక్రెయిన్.. రష్యాను దారుణంగా దెబ్బకొట్టింది. రష్యాకు చెందిన యుద్ధ విమానాలను డ్రోన్ల ద్వారా ఉక్రెయిన్ పేల్చేసింది. దీంతో రష్యాకు ఊహించని ఎదురు దెబ్బ తగలింది.