Kim Jong Un ordered to increase the capacity of North Korean missiles: అమెరికా బెదిరింపులను ఎదుర్కోవడానికి ఉత్తర కొరియా అధ్యక్షుడు కీలక నిర్ణయం తీసుకున్నాడు. కొత్తగా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను, పెద్ద అణ్వాయుధాలను అభివృద్ధి చేయాలని ఉత్తరకొరియా అధికారులకు కిమ్ జోంగ్ ఉన్ ఆదేశాలు ఇచ్చాడు. ఇటీవల కాలంలో కొరియా ద్వీపకల్ప ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో కిమ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి మీడియా వెల్లడించింది.