North Korea fires ballistic missile: నార్త్ కొరియా మరోసారి క్షిపణి ప్రయోగం చేపట్టింది. ఆదివారం తన నార్త్ కొరియా తూర్పు తీరంలో బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 7 గంటలకు ఉత్తర కొరియాలోని ప్యాంగాంగ్ ప్రావిన్సులోని టైచోన్ ప్రాంతం నుంచి స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించినట్లు దక్షిణ కొరియా వెల్లడించింది. మాక్ 5 వేగంతో దాదాపుగా 60 కిలోమీటర్ల ఎత్తులో 600 కిలోమీటర్లు ప్రయాణించినట్లు దక్షిణ కొరియా వెల్లడించింది.…