బెంగాల్‌లో ఓటింగ్ ముగిసిన తర్వాత కూడా హింస కొనసాగుతోంది. శనివారం రాత్రి నుంచి పలుచోట్ల బీజేపీ కార్యకర్తలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ దాడికి కారణం తృణమూల్ కాంగ్రెస్ (TMC) మద్దతుదారులేనని బీజేపీ ఆరోపిస్తుంది. కాగా.. వరుస దాడులతో భయాందోళనకు గురైన పలువురు బీజేపీ కార్యకర్తలు ఇళ్ల నుంచి వెళ్లిపోయారు. మరి కొందరు పార్టీ కార్యాలయాల్లో తలదాచుకున్నారు.
వర్షాలు వదిలేలా లేవు. ఇప్పటికే వారం రోజుల నుంచి కంటిన్యూగా కురుస్తున్నాయి. గత పాతికేళ్లలో వరుసగా ఇన్ని రోజులు ముసురు పట్టడం ఇదే తొలిసారి కావొచ్చు. దీంతో పొద్దు పొడవక, సూర్యుణ్ని చూడక ఎన్ని రోజులైందో అన్నట్లుంది. ‘సన్’డే ఎప్పుడొస్తుందా అని జనం ఎదురుచూస్తున్నారు. సెలవు కోసం కాదు. వాన ఇంకెప్పుడు సెలవు తీసుకుంటుందా అని. వాతావరణం విపరీతంగా చల్లబడటంతో బయటికి రాలేక, ఇంట్లో ఉన్నా తలుపులూ కిటికీలూ తెరుచుకోలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా…