Indian Economy: అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఇండియన్ ఎకానమీ గతేడాది ప్రత్యేక గుర్తింపు పొందింది. అయితే.. ఆ ఆనందం మరెన్నాళ్లో ఉండేట్లు లేదు. వచ్చే ఏడాదిలోనే ఈ టైటిల్‌ని కోల్పోయే ఛాన్స్ కనిపిస్తున్నాయి. కొవిడ్ అనంతరం ఆర్థిక వ్యవస్థలో కాస్త సానుకూల వాతావరణం నెలకొన్నప్పటికీ ఈ ప్రయోజనాలను అధిక రుణ భారం మరియు పెరుగుతున్న ఖర్చులు క్షీణింపజేస్తున్నాయని ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ కంపెనీ గోల్డమన్ శాక్స్ పేర్కొంది.