2024 సంవత్సరానికి గానూ వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి విజేతలను ప్రకటించారు. అమెరికాకు చెందిన విక్టర్ అంబ్రోస్, గ్యారీ రువ్‌కున్‌లకు వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతిని ప్రకటించారు. మైక్రోఆర్‌ఎన్‌ఏ (జన్యు కార్యకలాపాలను నియంత్రించే ప్రాథమిక సూత్రం)ను కనుగొన్నందుకు ఇద్దరికీ ఈ గౌరవం లభించింది. సోమవారం.. స్టాక్‌హోమ్‌లోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌లోని నోబెల్ అసెంబ్లీ విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రువ్‌కున్‌లకు వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతిని ప్రకటించింది.