ఇండోనేసియాలో భారీ భూకంపం సంభవించింది. సోమవారం తనింబర్ దీవుల ప్రాంతంలో 6.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూమి ఉపరితలం క్రింద 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లుగా జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) తెలిపింది.
జపాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 6.1గా తీవ్రత నమోదైంది. ప్రస్తుతం సునామీ హెచ్చరిక జారీ చేయలేదు. భూకంప కేంద్రం హొక్కైడో తూర్పు తీరంలో గుర్తించబడింది.