నల్గొండ జిల్లాలో అసలే అంతంత మాత్రంగా ఉన్న రోడ్లు మరమ్మతులు చేయకపోవడంతో మరింత అధ్వాన్నంగా తయారయ్యాయి.నిధులు సకాలంలో మంజూరు కాకపోవడంతో కాంట్రాక్టర్లు రోడ్ల మరమ్మత్తులు చేసేందుకు ముందుకు రావడం లేదు. కొన్ని చోట్ల కాంట్రాక్టర్లు గడువు లోపు పనులు చేయకుండానే చేతులెత్తేస్తున్నారు. దీంతో జిల్లాలో వంద కోట్ల విలువైన పనులకు బ్రేక్ పడ్డాయి. నల్గొండ జిల్లాలో 1835 కిలోమీటర్లు పనులు ఉన్నాయి. అందులో రాష్ట్ర రహదారులు 195 కిలోమీటర్లు కాగా మిగిలినవి జిల్లా రహదారులు 1636 కిలోమీటర్లు.ఈ…
నిధులు లేకున్నా పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారట ఆ ఎమ్మెల్యే. వాటికి భారీగా ప్రచారాలు చేసుకోవడం ఇప్పుడు చిక్కొచ్చి పడింది. స్వపక్షానికి.. విపక్షాలకు ఆ ఎమ్మెల్యే టార్గెట్ అయ్యారు. కాసులు లేకుండా కితకితలెందుకని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారట. ఎక్కడో ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. నిధులు లేకుండా అభివృద్ధి పనులకు భూమి పూజలుయాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ఎమ్మెల్యే.. ప్రభుత్వ విప్ గొంగిడి సునీత ప్రస్తుతం నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారారు. ఈ మధ్య ఆలేరులో విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు.…