దేశ రాజధాని ఢిల్లీ తీవ్రమైన కాలుష్యంతో అతలాకుతలం అవుతోంది. ఈ నేపథ్యంలో, పర్యావరణ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా ఈరోజు (డిసెంబర్ 16) ఢిల్లీలోని పెట్రోల్ పంపులలో చెల్లుబాటు అయ్యే కాలుష్య నియంత్రణ (పియుసి) సర్టిఫికేట్ లేని వాహనాన్ని గురువారం (డిసెంబర్ 18) నుంచి ఫ్యుయల్ ఫిల్లింగ్ కు అనుమతించబోమని ప్రకటించారు. సిర్సా మీడియాతో మాట్లాడుతూ, కొత్త నిబంధనను పాటించడానికి వాహన యజమానులకు ఒక రోజు గడువు ఇచ్చామని అన్నారు. దేశ రాజధానిలో వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి…