No Benefit shows: ఆంధ్రప్రదేశ్ లో సినిమా కష్టాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పుడు టిక్కెట్ రేట్లను పెంచినా, కొందరు ఎగ్జిబిటర్స్ మాత్రం ఫ్యాన్స్ షోస్, బెనిఫిట్ షోస్ కు ససేమిరా అంటున్నారు.
ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో భీమ్లానాయక్ మేనియా పట్టుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమాకావడంతో ఈ మూవీని చూడాలని అభిమానులు ఉత్సాహంగా వున్నారు. అయితే థియేటర్ యజమానులకు ప్రభుత్వం షాకిచ్చింది. టికెట్ ధరలు, బెనిఫిట్ షోలు వేయడానికి అవకాశం లేదని, అలా కాదని బెనిఫిట్ షోలు ప్రదర్శిస్తే సినిమాటోగ్రఫీ చట్టం కింద కేసులు నమోదుచేస్తామని రెవిన్యూ అధికారులు స్పష్టం చేయడంతో థియేటర్ యజమానులు దిక్కుతోచక అల్లాడుతున్నారు. కృష్ణాజిల్లా మైలవరంలో భీమ్లా నాయక్ సినిమాకు ఆటంకాలు ఏర్పడ్డాయి.…