జగన్ పాలనపై మండిపడ్డారు ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి. కర్నూలు జిల్లా నంద్యాలలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం రైతు దుష్మన్ ప్రభుత్వంగా మారిందన్నారు. సి.ఎం జగన్ మోహన్ రెడ్డి 32 నెలల కాలంలో వ్యవసాయ, సాగునీటి రంగానికి ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. ప్రభుత్వం వ్యవసాయ,సాగునీటి రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని తులసిరెడ్డి మండిపడ్డారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వలేక చేతులు ఎత్తేశారని తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. జగన్ ప్రభుత్వంలో రాష్ట్రంలో…