యంగ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం “బింబిసారా”. నటసార్వభౌమ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈ సినిమా టైటిల్ ను ప్రకటించారు మేకర్స్. ఇది కళ్యాణ్ రామ్ కు 18వ చిత్రం. కత్తిని పట్టుకుని కళ్యాణ్ రామ్ సరికొత్త లుక్ లో, గెటప్ లో కన్పించి అభిమానులను సర్ప్రైజ్ చేశాడు. మృతదేహాల సమూహంపై కూర్చుని ఉన్న కళ్యాణ్ మేక్ఓవర్ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. టైం ట్రావెల్ తో తెరకెక్కనున్న ఈ సోషల్ ఫాంటసీలో భారీ…