ఇండియా కూటమిలో విభేదాలు మరింత ముదురుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే జేడీయూ బయటకు వచ్చేసి ఎన్డీఏతో జత కట్టింది. తాజాగా పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు కూటమిని ఆందోళనకు గురయ్యేలా చేశాయి. ఓ కార్యక్రమంలో మమత మాట్లాడుతూ కాంగ్రెస్ తీరును తప్పుపట్టారు.