Nitish Kumar: బీహార్ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. అన్ని పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే, ఎన్నికల ముందు సీఎం నితీష్ కుమార్ బీహార్ ప్రజలకు వీడియో సందేశం ఇచ్చారు. 2005లో తొలిసారి ఎన్నికైనప్పటి నుంచి తాను ‘‘నిజాయితీగా కష్టపడి పనిచేయడం ’’ ద్వారా ప్రజలకు సేవ చేశానని అన్నారు. మూడు నిమిషాల వీడియోలో.. ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. 2005కు ముందు బీహారీగా ఉండటం అవమానకరమైన విషయంగా ఉండేదని చెప్పారు.
బీహార్ తొలి దశ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడింది. అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. తాజాగా బీహారీయులను ఉద్దేశించి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కీలక సందేశాన్ని విడుదల చేశారు. తానెప్పుడూ కుటుంబం కోసం పని చేయలేదని.. 2005లో ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు బీహార్ ప్రజల కోసం నిజాయితీగా.. కష్టపడి సేవ చేసినట్లుగా వివరించారు.