హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సరూర్ నగర్ పరిధిలో జీఎస్టీ అధికారుల కిడ్నాప్ కలకలం రేపింది. ఈ కిడ్నాప్ కేసును పోలీసులు చేధించిన ఘటనపై కేంద్రం సీరియస్ అయింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారుల కిడ్నాప్ ఘటనపై తెలంగాణ పోలీసులను ఆరా తీశారు. అధికారుల కిడ్నాప్ ఉదంతాన్ని తీవ్రంగా ఖండించిన ఆమె.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ అంజనీ కుమార్ ను ఫోన్లో కోరింది.
Nirmala Sitharaman : దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కుమార్తె పరకాల వాంగ్మయి వివాహం బుధవారం కర్ణాటకలోని బెంగళూరులో జరిగింది. వివాహానికి సన్నిహితులు, బంధువులు మాత్రమే హాజరయ్యారు.
Aadhar-PAN Link Penalty Increase: పాన్ కార్డు కలిగిన వారు కచ్చితంగా ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాలి. దీనికి కేంద్రం మొదట గడువు మార్చి 31గా నిర్ణయించింది.
Writeoff Loans: లోన్లు తీసుకున్నవాళ్లలో ప్రతిఒక్కరూ వాటిని పూర్తిగా తిరిగి చెల్లిస్తారనే గ్యారంటీ లేదు. దీంతో.. వివిధ కారణాల వల్ల కొన్ని రుణాలు మొండి బకాయిలుగా మారుతుంటాయి. నిరర్థక ఆస్తులుగా మిగిలిపోతాయి. మరికొన్నింటిని సాంకేతికంగా రద్దు చేస్తుంటారు. అంటే.. టెక్నికల్‌గా.. రైటాఫ్ చేస్తారు. ఫలితంగా.. కొందరు.. ఈ రుణాలను తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదేమో అనుకుంటారు.
Income Tax : ఆదాయం పన్ను పరిధిలోకి వచ్చే పౌరులకు ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడం తప్పనిసరి. కొత్త ఆర్థిక సంవత్సరం 1 ఏప్రిల్ 2023 నుండి ప్రారంభమవుతుంది.
YS Jagan Meets Nirmala Sitharaman: బుధవారం ఢిల్లీ వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో సమావేశం అయ్యారు.. ఇక, ఈ రోజు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు.. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.. ఈ సమావేశం ముగిసిన తర్వాత సీఎం తన ఢిల్లీ పర్యటనను ముగించుకుని విజయవాడ బయల్దేరి వెళ్లారు ఆంధ్రప్రదేశ్ సీఎం.. Read Also: Life Threatening: హెచ్ఆర్సీని…
లోక్‌సభ 64 అధికారిక సవరణలతో ఆర్థిక బిల్లు-2023ని ఆమోదించింది. సీతారామన్ పార్లమెంట్లో ఫైనాన్స్ బిల్లు 2023ని ప్రవేశపెట్టారు. అదానీ సమస్యపై జేపీసీ విచారణను డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఎంపీల భారీ నినాదాల మధ్య చివరికి వాయిస్ ఓటింగ్ ద్వారా ఆమోదించబడింది.
GST Council Meeting: జీఎస్టీ పరిహారం బాకాయిలు రూ.16,982 కోట్లను రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. శనివారం జరిగిన 49వ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆలస్యంగా జీఎస్టీ ఫైల్ చేస్తే విధించే పెనాల్టీని సవరించాలని మండలి భావించినట్లు తెలిపారు. జూన్ నెల వరకు రాష్ట్రాలకు రూ.16,982 కోట్ల జీఎస్టీ బకాయిలను చెల్లించాల్సి ఉందని ఆమె తెలిపారు.