GST Effect: కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడంతో, మార్కెట్లో కొనుగోళ్ల ప్రభావం కనిపిస్తోంది. పండగ సీజన్ కూడా కావడంతో మార్కెట్ లో సందడి నెలకొంది. సామాన్యుడికి అవసరమైన నిత్యావసరాలతో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులు, బైకులు, కార్లపై గతంలో 28 శాతం ఉన్న జీఎస్టీని కేంద్రం 18 శాతానికి తగ్గించింది. తగ్గించిన జీఎస్టీ సెప్టెంబర్ 22 నుంచి అమలులోకి వచ్చింది. దీంతో, తగ్గిన ధరల కారణంగా తమకు అవసరమయ్యే వస్తువుల్ని కొనుగోలు చేస్తున్నారు. దీంతో పాటు నవరాత్రి, దీపావళి…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. ఈ భేటీలో రాష్ట్రంలోని వివిధ ఆర్థిక, అభివృద్ధి అంశాలపై చర్చించారు.
తాజా భారీ వర్షాలు, వరదలతో తెలంగాణ రాష్ట్రం అతలాకుతలం అయిన నేపథ్యంలో రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర పరిస్థితులను వివరించారు.
గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్-GSTలో కీలక సంస్కరణలు చోటుచేసుకున్నాయి. సామాన్యుడికి ఊరట కలిగించే పన్ను విధానంలో పునర్వ్యవస్థీకరణకు GST కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. GSTలో ఇప్పటి వరకూ కనిష్ఠంగా 5 శాతం పన్ను, గరిష్ఠంగా 28శాతం పన్నుతో 4 స్లాబులు ఉండేవి. అయితే, 12, 28 శాతం స్లాబుల్ని తొలగించాలని GST కౌన్సిల్ నిర్ణయించింది.
Updated Income Tax Bill: 1961 ఆదాయపు పన్ను చట్టం స్థానంలో కొత్త చట్టం తీసుకొచ్చేందుకు ఈ ఏడాది ఫిబ్రవరి 13న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదాయపు పన్ను నూతన బిల్లు 2025ను పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. తాజాగా ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకొని, అప్డేట్ చేసి మళ్లీ పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు కొన్ని జాతీయ పత్రికలు వెల్లడించాయి. లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై విపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో బిల్లును సెలెక్ట్ కమిటీకి…
ఈసారి బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి నారీమణులను వరించే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. జేపీ నడ్డా వారసుడిగా తొలిసారి మహిళా అధ్యక్షురాలు అవ్వొచ్చని నివేదికలు అందుతున్నాయి. ఈ మేరకు ఆర్ఎస్ఎస్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
2029 పార్లమెంట్ ఎన్నికల తర్వాతే ‘జమిలి ఎన్నికలు’ అమల్లోకి వస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ ప్రక్రియను 2029 తర్వాతే రాష్ట్రపతి ప్రారంభిస్తారని, 2034లో జమిలి జరిగే అవకాశం ఉంటుందన్నారు. జమిలిపై ఏమీ జరగక ముందే రాజకీయ పార్టీలు అసత్య ప్రచారం చేస్తున్నాయన్నారు. ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ అనేది కొత్త ఆలోచన కాదని, ఇది ఎప్పటి నుంచో ఉన్నదే అని పేర్కొన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలలో దాదాపు రూ.లక్ష కోట్లు…
New Income Tax Bill: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కొత్త ఆదాయపు పన్ను బిల్లును చర్చకు తీసుకుంటామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం తెలిపారు.
కేంద్ర ప్రభుత్వంగా కాదు.. మా బాధ్యతగా ఆంధ్రప్రదేశ్‌కు సహకారం అందిస్తున్నాం అన్నారు.. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆమె.. బడ్జెట్ ప్రవేశ పెట్టిన తరవాత దేశ వ్యాప్తంగా చర్చలు నిర్వహిస్తున్నాం. మొదట ముంబైలో.. రెండో చర్చ విశాఖ లో నిర్వహించాం అన్నారు.. విశాఖలో బడ్జెట్ పై వివిధ వర్గాల ప్రజలను కలసి వారి సలహాలు, సూచనలు తీసుకున్నాం అన్నారు..