మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వానలకు వరదలు ముంచెత్తాయి. దీంతో కాళేశ్వరం పంప్‌హౌస్‌లు మునిగిపోవడంపై విపక్షాలు చేసిన విమర్శలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీర్ అయిన పెంటారెడ్డిపై అవమానకర వ్యాఖ్యలు చేయడంపై ఆయన దుయ్యబట్టారు. అంతేకాకుండా.. గతంలో చాలా సార్లు ఇటువంటి భారీ వరదలు వచ్చినప్పుడు ఎన్నో ప్రాజెక్టులు మునిగిపోయాని నిరంజన్ రెడ్డి గుర్తుచేశారు. ఎవ్వరైనా సరే ఎంత అడ్డుకున్నా ఏడాదిన్నరలోపు పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి…