Nipah Virus: కేరళలోని కోజికోడ్‌లో నిపా వైరస్ కేసులు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి భయానక వాతావరణం నెలకొంది. నిపా వైరస్ దృష్ట్యా, కోజికోడ్‌లోని అన్ని విద్యాసంస్థలు వచ్చే ఆదివారం వరకు అంటే సెప్టెంబర్ 24 వరకు మూసివేయబడ్డాయి.
Nipah Virus: నిపా వైరస్ ఇప్పుడు కేరళ రాష్ట్రాన్ని కలవరపెడుతోంది. ముఖ్యంగా కోజికోడ్ జిల్లాల్లోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇప్పటికే ఈ వ్యాధి ఐదుగురికి సోకింది. ఇందులో ఇద్దరు మరణించడంతో అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొంటోంది.