TGSWREIS : ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల్లో ఆహార భద్రత, నాణ్యత ప్రమాణాలకు ఎన్ఐఎన్ సహకారం అందించనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు మరో ముందడుగు వేసింది. ప్రభుత్వ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లలో ఆహార భద్రతతో పాటు నాణ్యత ప్రమాణాలను పెంపొందించేందుకు హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (జాతీయ పోషకాహార సంస్థ) సహకారం తీసుకుంటోంది. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ…