లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన అన్ని దశలు పూర్తయిన తర్వాత ఒక వైపు దేశం ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుండగా.. మరోవైపు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ప్రజలకు పెద్ద షాక్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా టోల్ పన్నును పెంచింది. ఈరోజు నుంచి అన్ని టోల్ ప్లాజాల వద్ద వాహనదారులు 5 శాతం అదనంగా టోల్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.