ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్లయిన వారిని దూరంగా ఉంచడాన్ని మనందరం చూస్తూనే ఉంటాం. సాధారణంగా ఆషాఢ మాసాన్ని శూన్యమాసం అంటారు. ఈ మాసంలో ఎలాంటి శుభకార్యాలను చేపట్టరు. ముఖ్యంగా అత్తగారింట్లో కోడలిని ఉంచకూడదని భావిస్తారు. ఎందుకంటే ఉత్తరాయణ, దక్షిణాయన కథల ప్రకారం ఆషాఢ మాసంలో శ్రీమహావిష్ణువు నిద్రలోకి వెళ్తాడని, దీనివల్ల వివాహం చేసుకున్న దంపతులకు ఆయన ఆశీస్సులు లభించవనే నమ్ముతారు. దీంతో ఆషాఢంలో కొత్తగా వచ్చిన కోడలిని అత్తగారింట్లో ఉంచకుండా పుట్టింటికి పంపించేస్తారు. ఈ మాసంలో తొలకరి…