నూతన సంవత్సరం 2022 సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీకి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒక్కటైన శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి ఆలయాలకు చెందిన వేదపండితులు ఢిల్లీ వెళ్ళారు. ప్రధాని మోడీని కలిసి ఆయనకు శుభాశీస్సులు అందచేశారు. దేవస్థానాల నుంచి తీసుకెళ్ళిన ప్రసాదాలను ప్రధానికి అందచేశారు. అక్షింతలు వేదపండితులు ఆశీర్వచనాలు, దేవస్థానం తరఫున చిత్రపటాలు అందచేశారు. ప్రధాని మోడీ చేతికి కంకణాలు కట్టి, నుదుటిన తిలకం దిద్దారు వేదపండితులు.
‘సంక్రాంతి అల్లుళ్లు’ విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్… ఈసారి ‘సమ్మర్ సోగాళ్ళు’గా మారిపోయారు. అయితే… వాళ్ళు సమ్మర్ కైనా వస్తారా అనే సందేహాన్ని ‘ఎఫ్ 2’ ఫ్రాంచైజ్ ఫాన్ నాగరత్తమ్మ (సునయన) వ్యక్తం చేస్తోంది. కొత్త సంవత్సరంలో ‘ఎఫ్ 2 ఫ్రాంచైజ్’ ఫ్యాన్స్ కు విషెస్ తెలియచేస్తూ, అనిల్ రావిపూడి ఓ సరదా వీడియోను రూపొందించి, సోషల్ మీడియాలో వదిలాడు. సంక్రాంతి పండగ అంటే అరిసెలు, పూతరేకులు కంపల్సరీ! వాటిని తయారు చేసుకుని నాగరత్తమ్మ, అనిల్ రావిపూడి…
కొత్త సంవత్సరం.. కొత్త ప్రారంభం.. కొత్త జీవితం.. సినీ ఇండస్ట్రీలో గతేడాది కరోనా సెకండ్ వేవ్ పాండమిక్ జ్ఞాపకాలను వదిలేసి.. న్యూ ఇయర్ లో సరికొత్త విజయాలను అందుకోవడానికి తమవంతు కృషి చేస్తున్నారు. ఇక నేడు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని కొత్త చిత్రాలు.. తమ కొత్త పోస్టర్లను రిలీజ్ చేసి ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్ కాంబోలో వస్తున్నా “బోళా శంకర్”.. కొత్త పోస్టర్ ని రిలీజ్ చేస్తూ షూటింగ్ ప్రారంభించినట్లు తెలిపారు.…
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ కి గతేడాది కలిసి రాలేదన్న విషయం తెలిసిందే. వరుస పరాజయాలు శర్వా ను పలకరించాయి. జాను, మహా సముద్రం చిత్రాలు శర్వా కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్లు గా నిలిచాయి. ఇక ఈ ఏడాది కొత్తగా ప్రారంభిస్తూ శర్వా కొత్త సినిమాలతో విజయాన్ని అందుకోవాలని చూస్తున్నాడు. ఇప్పటికే ‘ఒకే ఒక జీవితం’ షూటింగ్ ని పూర్తి చేసుకోగా, ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రం సెట్స్ మీద ఉన్నది. చిత్ర లహరి చిత్రంతో సాయి…
తెలుగు రాష్ట్రాల ప్రజలకు టీడీపీ చంద్రబాబు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరం ఆనందోత్సాహాలతో గడవాలని కోరుకున్నారు. ప్రతి ఇంటా సంతోషం, చిరునవ్వులు విరియాలని ఆయన ఆకాంక్షించారు. కొవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ వేడుకలు నిర్వహించుకోవాలని సూచించారు. Read Also:న్యూ ఇయర్ విషెస్ తెలిపిన తెలుగు రాష్ట్రాల సీఎంలు కొత్త ఆశలు, కొత్త ఆకాంక్షలతో ఉత్సాహంగా కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలన్నారు. 2022 ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఒమిక్రాన్ విస్తరిస్తున్న…
మరికొద్ది గంటల్లో మనమంతా కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముందుగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నూతన సంవత్సర శుభాకాంక్షలను సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. నూతనం… ప్రారంభం.. ఆరంభం.. అనే పదాలలోనే ఒక ఉత్తేజం నిండి ఉంటుందని… అటువంటిది కొత్త సంవత్సరం ఎన్నో ఆశలు, ఎన్నో ఆశయాలు, మరెన్నో ఆకాంక్షలు, లక్ష్యాలతో సంగమమై మన ముందుకు తరలివస్తుందని పవన్ పేర్కొన్నారు. ఇటువంటి 2022 నవ వసంతానికి ఆహ్వానం పలుకుతూ తెలుగువారందరితో…
తెలంగాణ ప్రజలకు మంత్రి జగదీశ్‌రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సర వేడుకలకు అందరూ దూరంగా ఉండి తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. ఆరోగ్యంగా ఉంటే ఏడాదంతా వేడుకలు చేసుకోవచ్చని తెలిపారు. ఒమిక్రాన్ వేరింయంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో నూతన సంవత్సర వేడుకలను ఇళ్లలోనే నిర్వహించుకోవాలని మంత్రి ప్రజలను కోరారు. Read Also:చాదర్‌ఘాట్‌లో ఘోర అగ్ని ప్రమాదం ఆరోగ్యాలను కాపాడుకోవడానికి అందరూ ప్రథమ ప్రాధాన్యతను ఇవ్వాలన్నారు. ప్రాణాలు విలువైనవని అందుకే వేడుకల పేరుతో ఎవ్వరు ప్రాణాల…
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయ రాజా ఆరోగ్యం బాగోలేదని. ప్రస్తుతం ఆయన హాస్పిటల్ లో చికిత్స తీసుకొంటున్నారని గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇక ఈ వార్తలు నిజమో, కాదో తెలియకుండానే నెటిజన్లు ఇళయరాజా కోలుకోవాలని కామెంట్స్ పెట్టేస్తున్నారు. ఇక తాజాగా ఈ పుకార్లకు చెక్ పెట్టారు ఇళయరాజా.. ఎంతో చక్కగా తనదైన శైలిలో ఒక మధురమైన పాటను ఆలపిస్తూ అందరికి నూతన సంవత్సర శుబాకాంక్షలు తెలుపుతూ వీడియోని రిలీజ్ చేశారు. ప్రస్తుతం…
మరికొద్ది గంటల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ నేపథ్యంలో ప్రజలకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతామన్నారు. కష్టాలను అధిగమిస్తూ సుపరిపాలన అందిస్తామని కేసీఆర్ తెలిపారు. వినూత్న పంథాలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. Read Also: రేపటి నుంచి నుమాయిష్ ప్రారంభం మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సీఎం జగన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు…