కరోనా మళ్లీ భయపెడుతోంది.దేశంలో పాజిటివ్ కేసులు ప్రకంపం సృష్టిస్తున్నాయి.ఊహించిన దానికి కంటే వైరస్ వేగంగా విస్తరిస్తోంది.చూస్తుండగానే తెలుగురాష్ట్రాల్లోకి ఎంటరైంది.ఏపీలో కడప,విశాఖను తెలంగాణలో కూకట్‌పల్లిని టచ్ చేసింది.కరోనాకు పెద్దగా భయపడాల్సింది లేకపోయినా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.మరి లైట్ తీసుకుంటే లైఫ్‌లో రిస్క్‌లో పడినట్టేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Corona : కేరళలో మంగళవారం కొత్తగా 115 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో యాక్టివ్‌గా ఉన్న కరోనా కేసుల సంఖ్య 1749కి చేరింది. ప్రస్తుతం వస్తున్న కరోనా కేసులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేరళ ఆరోగ్య శాఖ తెలిపింది.