పీసీసీ కార్యనిర్వాహక, రాజకీయ వ్యవహారాల కమిటీలను కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించిన విషయం తెలిసిందే. 26 జిల్లాలకు కొత్త డిసిసి అధ్యక్షులను, 84 మంది జనరల్ సెక్రటరీలను అధిష్ఠానం నియమించింది. ఈ రెండు కమిటీల్లో పీసీసీ స్టార్ క్యాంపెయినర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి చోటు దక్కలేదు.
తెలంగాణ పీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో.. తెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ నియామక ప్రక్రియపై పంచాయతీ మొదలైంది. పదవి నాకు కావాలి.. అంటే నాకు అంటూ పోటీ పడ్డారు నేతలు. ఎవరికి వారు… తమ పంతాన్ని నెగ్గించుకునే పనిలో పడ్డారు. అయితే తెలంగాణ పీసీసీ చీఫ్ పై కసరత్తు ప్రారంభించిన కాంగ్రెస్ అధిష్టానం.. ఓ నిర్ణయానికి వచ్చి తాజాగా పీసీసీ అలాగే ఇతర కమిటీలను ప్రకటించింది. తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్…