రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం ఇండియన్ రైల్వేస్ మరో సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్‌లలో క్యాటరింగ్ క్యాష్ లెస్ చెల్లింపులు చేయాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. తాజా నిర్ణయంతో రైల్వే స్టేషన్‌లో క్యాటరింగ్‌తో సహా అన్ని స్టాల్స్‌లో నగదుకు బదులుగా డిజిటల్ పద్ధతిలో విక్రయిస్తారు. ఇలా చేయకుంటే రూ.10వేల నుంచి రూ.లక్ష వరకు అధికారులు జరిమానా విధించనున్నారు. డిజిటల్ చెల్లింపుల కోసం విక్రేతలు తప్పనిసరిగా యూపీఐ,…
ఇకపై విమానాల్లో ప్రయాణించాలనుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులు ఈ నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సిందే. ఆర్థిక మంత్రిత్వ శాఖ కొత్తగా కొన్ని నిబంధనలను తీసుకువచ్చింది. అనవసర ఖర్చులను తగ్గించేందుకు ఈ నియమాలను రూపొందించింది. ప్రభుత్వ ఉద్యోగులు విమానాల్లో ట్రావెల్ క్లాసులో అతితక్కువ ధర ఉన్న టికెట్ క్లాస్ నే ఎంచుకోవాలని.. పర్యటనలు, ఎల్టీసీ కోసం వెళ్లే వారు మూడు వారాల కన్నా ముందుగా టికెట్లను బుక్ చేసుకోవాలని సూచించింది. ఉద్యోగులు తమ ప్రయాణానికి ఒక్కో టికెట్ మాత్రమే బుక్ చేసుకోవాలని,…
ఇప్పటి వరకు ద్విచక్రవాహనాలపై ప్రయాణించే పెద్దలకు మాత్రమే హెల్మెట్ ధరించాలనే నియమం ఉండేది. కానీ కేంద్ర ప్రభుత్వం తాజాగా మరిన్ని నిబంధనలను ప్రకటించింది. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే చిన్నారులకు సైతం హెల్మెట్‌ను తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు చిన్నారులకు కూడా వారి సైజు ప్రకారం హెల్మెట్‌లను తయారు చేయాలని హెల్మెట్ తయారీదారులను ఈ మేరకు ప్రభుత్వం కోరింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త నిబంధనల ప్రకారం.. ఎవరైనా వీటిని ఉల్లంఘిస్తే…