తెలుగు సినీ పరిశ్రమలో తనదైన యూత్‌ఫుల్ కామెడీ టైమింగ్, వినోదాత్మక కథనంతో విజయాలు అందుకున్న దర్శకుడు వెంకీ కుడుముల సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. ‘చలో’, ‘భీష్మ’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్స్‌తో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వెంకీ కుడుముల, ఇకపై కేవలం మెగాఫోన్ పట్టుకోవడమే కాకుండా, కొత్త కథలను, కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించే నిర్మాతగా కూడా మారారు. తన సొంత బ్యానర్ ‘వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్’ (What Next Entertainments)ను స్థాపించి, తన తొలి చిత్ర…