సీఎం చంద్రబాబు భద్రత దృష్ట్యా కొత్త హెలికాప్టర్‌ను వినియోగిస్తున్నారు. రెండు వారాలుగా ఇందులోనే జిల్లాల పర్యటనలకు వెళ్తున్నారు. ఇటీవలి వరకు వాడిన బెల్ తయారీ ఛాపర్ పాతది కావడంతో అధునాతన ఫీచర్లతో కూడిన ఎయిర్‌బస్ హెచ్-160 మోడల్ హెలికాప్టర్‌కు మారారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రయాణాలకు అనువుగా ఉంటుందని నిపుణులు దీన్ని ఎంపిక చేశారు.