కొత్త జీఎస్టీ రేట్ల ప్రకటనతో.. దేశ ప్రజలకు పండగ సీజన్ ముందే వచ్చినట్టైంది. ప్రధాని చెప్పినట్టుగానే.. నిత్యావసరాలు చాలా వరకు తక్కువ పన్నురేటులోకి వచ్చేశాయి. ఇన్సూరెన్స్ రంగానికి జీఎస్టీ మినహాయింపుపై అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తమౌతోంది. జీఎస్టీ హేతుబద్ధీకరణ సరే.. కేంద్రం నష్టాన్ని ఎలా పూడ్చుకుంటుంది..? రాష్ట్రాలకు వచ్చే రెవిన్యూ నష్టాన్ని ఎలా భర్తీ చేస్తుంది..?