ఉగ్రవాదులను అంతమొందించేందుకు పోలీసులు సరికొత్త టెక్నాలజీ తీసుకురానున్నారు. రాత్రి వేళల్లో కార్యకలాపాలు నిర్వహిస్తుండగా.. సహచరులను గుర్తించేందుకు, శత్రువులను కచ్చితంగా టార్గెట్ చేసేందుకు ప్రత్యేక పరికరాలను కొనుగోలు చేయనున్నారు. ఐదు వేల వ్యూహాత్మక సామగ్రిని పోలీసులు కొనుగోలు చేయనున్నారు. ఇందులో వెయ్యి ఇన్‌ఫ్రారెడ్ లైట్ లేజర్‌లు, 4 వేల ఇన్‌ఫ్రారెడ్ ప్యాచ్‌లు ఉన్నాయి. ఇన్‌ఫ్రారెడ్ లేజర్ రాత్రిపూట 800 మీటర్ల దూరం వరకు శత్రువును చూస్తుంది.