ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం.. అభ్యంతరాలను స్వీకరిస్తోంది.. కొత్త జిల్లా కేంద్రాలు, పేర్లపై పలు విమర్శలు, విజ్ఞప్తులు వస్తున్నాయి.. కొందరి నుంచి ప్రశంసలు కూడా లభిస్తున్నాయి.. అయితే, కొత్త జిల్లాల విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై సెటైర్లు వేశారు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.. ప్రకాశం జిల్లాలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. కృష్ణా జిల్లాని ఎన్టీఆర్ జిల్లాగా మార్చడం అభినందనీయం అన్నారు.. ఎన్టీఆర్ పేరుని చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు విస్మరించారని మండిపడ్డ…