ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయని జనసేన పార్టీ అంచనా వేస్తోంది. 2023 మార్చిలో ఎన్నికలు జరుగుతాయని జనసేన పార్టీ విశ్వసిస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల కోసం సమాయత్తం అవుతున్నారు. అక్టోబర్ నుంచి బస్సు యాత్ర చేపట్టాలని ఇప్పటికే నిర్ణయించుకున్నారు. అక్టోబరు 5న విజయదశమి సందర్భంగా తిరుపతిలో పవన్ కల్యాణ్ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని ఇటీవల జనసేన పీఏసీ సభ్యుడు నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. కాగా పవన్ కళ్యాణ్…