విలక్షణ దర్శకుడు మణిరత్నం ఏది చేసినా అందులో ఏదో ఒక వైవిధ్యం చోటు చేసుకుంటుంది. జయేంద్ర పంచపకేశన్ తో కలసి మణిరత్నం నిర్మించిన వెబ్ సీరీస్ ‘నవరస’ ఆగస్టు 6 నుండి నెట్ ఫ్లిక్స్ లో సందడి చేస్తోంది. మణిరత్నం అందించిన సిరీస్ కదా, తెలుగువారికి మొదటి నుంచీ ఆసక్తి కలుగుతోంది. అందుకు తగ్గట్టుగానే తెలుగులోనూ అనువాదమయింది ‘నవరస’. పదాలు తెలుగులోనే వినిపించినా, పాటలు మాత్రం తమిళంలోనే వినిపిస్తాయి. కంగారు పడకండి! ఈ ‘నవరస’ తొలి ఎపిసోడ్…