అదేంటి నాన్న సినిమాకి పోటీగా శంకర్ కూతురు రావడం ఏంటి అని షాక్ అవుతున్నారా? అయితే ఈ స్టోరీ మీరు చూడాల్సిందే. 2025లో తమిళనాడులో పొంగల్‌కు కేవలం మూడు చిత్రాలు మాత్రమే విడుదల కావాల్సి ఉంది. అజిత్ విదాముయార్చి, బాల వనగన్, శంకర్ డైరెక్షన్లో రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్. అయితే చివరి క్షణంలో పొంగల్ రేసు నుంచి తప్పుకుంటున్నట్లు విదాముయార్చి చిత్రబృందం నిన్న ప్రకటించింది.