నటరత్న నందమూరి తారక రామారావు స్ట్రెయిట్ మూవీస్ తోనే కాదు, రీమేక్స్ తోనూ జయకేతనం ఎగురవేశారు. హిందీ రీమేక్స్ లోనూ విజయాల శాతం యన్టీఆర్ కే ఎక్కువ. రామారావు కథానాయకునిగా యస్.డి.లాల్ దర్శకత్వంలో రవిచిత్ర ఫిలిమ్స్ పతాకంపై వై.వి.రావ్ నిర్మించిన నేరం నాది కాదు ఆకలిది చిత్రానికి హిందీలో రాజేశ్ ఖన్నా హీరోగా రూపొందిన రోటీ మాతృక. ఈ చిత్రానికి ముందు రామారావుతో యస్.డి.లాల్ దర్శకత్వంలోనే వై.వి.రావ్ నిర్మించిన నిప్పులాంటి మనిషి కూడా హిందీ జంజీర్ ఆధారంగా…