ఐదు దశాబ్దాలుగా నలుగుతోన్న బ్యారేజ్ అంశంపై ఎట్టకేలకు ట్రైబ్యునల్ నుంచి సానుకూల తీర్పు వచ్చింది. ఆ తీర్పుతో ఖుషీ అయ్యారు అధికార పార్టీ నాయకులు. ఆ విజయం తమదే అని ప్రచారం చేసుకున్నారు కూడా. త్వరలో కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభిస్తామని ప్రకటనలు గుప్పించారు. కానీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితులను గమనించి ఎక్కడి వారు అక్కడే గప్‌చుప్. ఇంతకీ నేతలకు మింగుడు పడని అంశాలేంటి? దశాబ్దాల కల.. కలేనా? 1961లోనే నేరడి బ్యారేజీ కోసం శంకుస్థాపన నేరడి బ్యారేజ్.…