Nepal Palace Massacre: నేపాల్‌లో సోషల్ మీడియా బ్యాన్‌కు వ్యతిరేకంగా యువత పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఈ నిరసనలకు తలొగ్గి ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామా చేశారు. ఆయన మంత్రివర్గంలోని పలువురు మంత్రులు కూడా రాజీనామాలు చేశారు. ఇప్పుడు నేపాల్‌లో మరోసారి రాచరికం మళ్లీ వస్తుందా అనే వాదన మొదలైంది.
Nepal: నేపాల్‌లో ప్రజాస్వామ్యం అనే ప్రయోగం విఫలమైంది. 17 ఏళ్లలో 14 ప్రభుత్వాలు నేపాల్ ను పాలించాయంటే, అక్కడి అస్థిరత ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 2008లో ‘‘రాచరికం’’ పోయిన తర్వాత, ప్రజాస్వామ్య దేశంగా మారిన నేపాల్ అనుకున్న లక్ష్యాలను సాధించలేదు. చివరకు అవినీతి, బంధుప్రీతి పెరిగిపోయింది.